న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో కర్నాటక సీఎం కుమార స్వామి భేటీ అయ్యారు. కుమార స్వామి నేతృత్వంలో ప్రతినిథి బృందం ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీని కలిసింది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా భారీగా నష్టం వాటిల్లిందనీ, వరద ప్రభావిత జిల్లాలలో సహాయ పునరావాస చర్యల కోసం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కుమార స్వామి ప్రధాని మోడీని కోరారు. ప్రధానిని కలిసిన ప్రతినిథి బృందంలో మాజీ ప్రధాని హెడ్ డి దేవగౌడ కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa