న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలును భారత వైమానిక దళం సమర్థించింది. రాఫేల్ కొనుగోలుపై వివాదం నెలకొనడంతో.. ఈ అంశంపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. ఎమర్జెన్సీ కింద 36 రాఫేల్ జెట్లను కొనుగోలు చేయడం అవసరమని ఆయన అన్నారు. రాఫేల్‌తో పాటు ఎస్-400 రక్షణ ఆయుధాలతో వైమానిక దళాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. వైమానిక దళంలో తగ్గుతున్న సంఖ్య కొరతను తీర్చేందుకు రాఫేల్ ప్రొక్యూర్‌మెంట్ అవసరమన్నారు. 2016లో పారిస్ వెళ్లిన మోదీ.. అక్కడ రాఫేల్ విమానాల కోనుగోలుపై ఒప్పందం కుదుర్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa