మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఉమ్డి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహారం తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వచ్చి వాంతులు అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa