పరిగి మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిల్వ ఉంచిన ఇసుక డంపు వద్ద టిడిపి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఇసుక అక్రమ రవాణా ఆపాలని, ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే బి. కె. డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురుబ కృష్ణమూర్తి, వెంకటరాముడు, నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa