నంద్యాల మండలం, అంకిరెడ్డిపల్లి మైనింగ్ బ్లాక్ పరిధిలో లైమ్‌స్టోన్ ఖనిజ నిల్వలు ఉన్న భూములను అసైన్ చేస్తే.. అవి కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని, లబ్ధిదారులకు ఇచ్చే పట్టాలో ఈ విషయాన్ని ముద్రించాలని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్ చేయాలని నిర్ణయించిన భూముల్లో ఖనిజ నిల్వలు ఏమైనా ఉన్నాయా.. వాటిని సాగు నిమిత్తం అసైన్ చేయవచ్చా.. భూములు సాగుకు యోగ్యమైనవేనా.. అసైన్ చేసేందుకు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా.. తదితర వివరాలను నివేదిక రూపంలో కోర్టు ముందుంచాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనులశాఖను వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.