పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పౌరుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పుష్కలంగా ఉన్న ఇక్కడి వనరులను పాక్ దోచుకుంటుందని, కనీసం బతికే అవకాశాలు తమకు ఇవ్వడం లేదని పీఓకే ప్రజలు వాపోతున్నారు. ప్రజల ఆందోళనలను అక్కడి పాలకులు అణచివేస్తున్నారు. ఆహార సంక్షోభం, తాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అనధికార విద్యుత్ కోతలతో అవస్థలు తప్పడం లేదు. తమ విజ్ఞప్తులను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.