కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: 200 గ్రా., స్వీట్ కార్న్: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ: ఒకటి (చిన్నది), మిరియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర, ఉల్లికాడలు: కొద్దిగా, నూనె: ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కార్న్‌ఫ్లోర్: ఒక టీస్పూన్
తయారీ విధానం
చికెన్‌ను లీటర్ నీళ్లలో బాగా ఉడికించాలి. నీటిని వేరుచేసి పక్కన పెట్టుకుని, చల్లారిన చికెన్‌ను మెత్తగా మెదుపుకోవాలి. స్వీట్‌కార్న్‌ను కూడా ఉడికించి నీళ్లు తీసి, ఒక కప్పు పరిమాణంలో మిక్సీ పట్టుకుని, ఇంకో అరకప్పు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేయించాలి. కార్న్ మిశ్రమం వేసి ఒక నిమిషంపాటు వేయించి మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి; చికెన్, కార్న్ ఉడికించిన నీటిని పోసుకోవాలి. బాగా మరుగుతుండగా చికెన్ మిశ్రమం, కార్న్ వేసి ఉడికించాలి. అరకప్పు నీళ్లలో కార్న్‌ఫ్లోర్ వేసి, ఉండలు లేకుండా కలపాలి. దాన్ని సూప్‌లో వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లికాడలు వేసి దించుకుంటే చికెన్ కార్న్ సూప్ సిద్ధం.