ఎట్టకేలకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరయింది. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం పన్నెండు రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ బెయిల్‌పై ఉండనున్నారు. ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భాస్కరరెడ్డిని విచారించిన సీబీఐ అతనిని అదుపులోకి తీసుకున్నది. నాటి నుంచి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఎస్కార్ట్ బెయిల్ వచ్చింది.