కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నేడు) నుంచి 4వ విడత వారాహి విజయ యాత్ర చేపట్టనున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో 5 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు భారీ బహరంగసభ జరగనుంది. కాగా జనసేన, తెలుగుదేశం కలిసే ఎన్నికలకు వెళ్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన అనంతరం నిర్వహిస్తున్న వారాహి యాత్ర కావడంతో ఈ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వారాహి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం నేతలకు, కార్యకర్తలకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa