ఏపీలో రాజకీయ దుమారం రేపిన దివంగత మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగానున్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో విశ్రాంతి అవసరమని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పొడిగించాలని కోరారు. వైద్యుల సూచనలు, తదుపరి చికిత్సల దృష్ట్యా మరో రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 3న విచారించనున్నట్లు పేర్కొంది. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో అక్టోబర్ 3 (మంగళవారం) వరకు భాస్కర్ రెడ్డికి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు సమీపిస్తుండడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి మరోమారు కోర్టును ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa