బిహార్‌లో ఇటీవల నిర్వహించిన కుల గణన పూర్తయింది. దీనికి సంబంధించిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదలైంది. బిహార్ జనాభాలో 63 శాతం వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని జనగణన నివేదిక తేల్చింది. ఈ జనగణన నివేదికపై స్పందించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. త్వరలోనే తమ కూటమిలోని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే బిహార్‌లో కులగణన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. వాటిని ధర్మాసనం కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అయితే ఈ క్రమంలోనే కులగణనను కొనసాగించిన నితీశ్ కుమార్ ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది.
బిహార్‌లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం.. బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. అందులో అత్యంత వెనుబడిన తరగతుల(ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్ క్యాస్టెస్) వారు 36 శాతంగా ఉన్నట్లు వివేక్ సింగ్ వెల్లడించారు. ఇక ఇతర వెనుకబడిన తరగతుల(బ్యాక్‌వర్డ్ క్యాస్టెస్) వారు మరో 27.13 శాతంగా తేలింది. ఇక కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని ఈ కులగణన రిపోర్టులో వెల్లడైంది. మొత్తం బిహార్ రాష్ట్ర జనాభాలో యాదవుల వాటా 14.27 శాతం ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 1.7 శాతం ఉన్నట్లు కులగణనలో తేలింది. మరోవైపు.. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తెలిసింది.
అయితే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే దేశం మొత్తం కులగణన చేపట్టడం సాధ్యం కాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే బిహార్‌లో కులాల వారీగా ఉన్న ప్రజల లెక్కలు లెక్కిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించడం ప్రారంభించారు. బిహార్‌లో ఉన్న మొత్తం 38 జిల్లాల్లో.. రెండు దశల్లో ఈ జనగణన ప్రక్రియను పూర్తి చేశారు. అయితే బిహార్‌లో కులగణన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసిన పాట్నా హైకోర్టు.. కులగణనకు అనుమతించింది. అయితే హైకోర్టు వీటిని కొట్టివేయడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
ఇక బిహార్‌లో కులగణన పూర్తయి.. నివేదిక విడుదలైన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సోమవారం ఉదయం నితీశ్ కుమార్ తెలిపారు. కులగణన నివేదికపై ఈ భేటీలో చర్చిస్తామని.. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై కీలక విషయాలు చర్చిస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa