మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా కనీసం 24 మంది మరణించారు. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సోమవారం తెలిపారు.మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన పన్నెండు మంది పెద్దలు పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన తెలిపారు.