కొమరాడ మండలం పాలెం పంచాయతీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మంగళవారం శంకుస్థాపన చేపట్టారు. మాదలంగి బిటి రహదారి నుంచి పాలెం గ్రామం వరకు కోటి 65 లక్షలతో 2 కిలోమీటర్ల మేర రహదారి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa