ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందికి 10 వేలు చొప్పున జరిమానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 09:22 PM

గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు ఈ నెల 6న ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రూ. 10 వేలు జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష విధించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa