అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు. కాగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అటు హైకోర్టు తీర్పును వెలువరించిందో లేదో.. ఇటు సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొందరి పేర్లను యాడ్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa