తమ డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆల్ ఒడిశా బస్ ఓనర్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. బ్లాక్‌లను జిల్లా కేంద్రానికి కలుపుతూ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు అసోసియేషన్ మధ్య జరిగిన సమావేశం తరువాత సమ్మెను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కార్యదర్శి దేబేంద్ర సాహు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు, పంచాయతీల నుంచి బ్లాకుల వరకు బస్సులను నడపవచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.పాత బస్సులకు పర్మిట్‌లు ఇవ్వాలని, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లను (విఎల్‌టిడి) ఏర్పాటు చేసేందుకు గడువును మరో ఏడాది పొడిగించాలనే తమ డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సాహు పేర్కొన్నారు.