ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజుల పాటూ తిరుమల రైలు రద్దు,,,,ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:33 PM

తిరుమల వెళ్లే రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ రూట్‌లో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామని వివరించారు. అయితే గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి. ఈ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను పేదవాళ్ల రైలుగా పిలిచుకుంటుంటారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైళ్ల రద్దును దృష్టిలో పెట్టుకుని జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు విజయవాడ డివిజన్ పరిధిలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com