కుల, ఆదాయ ధ్రువపత్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ధ్రువపత్రాల విషయంలో ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. ఆదాయ ధ్రువీకరణ కోసం సచివాలయాల్లో చేసిన 6 దశల ధ్రువీకరణ సరిపోతుందని లేదంటే లబ్దిదారుల సమాచారం సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలంది.