స్కిల్ డెవలప్‌మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఈ నెల 17 వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ కేసు విచారణ 17కు వాయిదా పడటంతో టీడీపీ శ్రేణులు నిరాశ చెందుతున్నాయి. ఇక సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa