దేశవ్యాప్తంగా దసరాకు ముందు ఉండే నవరాత్రులకు ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఈ దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ నవరాత్రి ఉత్సవాలను ఒక్కో రకంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే గుజరాతీలు ఈ దుర్గామాత శరన్నవరాత్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించుకుంటారు. దీంతో ఈ పాట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ప్రధాని మోదీ పాడిన ఆ పాటను చూసేయండి. ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా గుజరాత్ సంప్రదాయ నృత్యమైన గార్భా నృత్యం చేస్తారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలకు ముందు గార్భా పాట ఆధారంగా రూపొందించిన ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆ పాటను రాయడం విశేషం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే ఆ పాటను కొన్ని సంవత్సరాల క్రితం తాను రాసినట్లు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
‘గార్బో’ పేరిట రూపొందించిన ఈ పాటకు బాలీవుడ్ సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చీ స్వరాలు సమకూర్చారు. ఇక ఆ పాటను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాశారు. సింగర్ ధ్వని భానుశాలీ ఈ పాటను పాడారు. ఈ పాట విడుదలైందంటూ సింగర్ ధ్వని భానుశాలీ ట్వీట్ చేశారు. ఈ వీడియోను పంచుకున్న ధ్వని భానుశాలీ.. ఈ పాటను రాసినందుకు తాను, తనిష్క్ బాగ్చి చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని రాసిన పాటకు కొత్త రిథమ్‌తో వీడియో రూపంలో తీర్చి దిద్దడంలో తమకు సహాయపడిందని ధ్వని భానుశాలీ వెల్లడించారు. అయితే ఈ ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ పాట రూపకల్పనలో భాగమైనవారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం తాను ఈ పాటను రాసినట్లు గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ.. ఈ పాట అనేక జ్ఞాపకాలను తనకు గుర్తు చేసిందని తెలిపారు. చాలా సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేదని.. అయితే కొన్ని రోజులుగా ఒక కొత్త గార్బా పాట రాసినట్లు వెల్లడించారు. ఆ పాటను ఈ నవరాత్రుల సందర్భంగా విడుదల చేస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.