పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్ ప్రాంతంలోని ఫర్నిచర్ షోరూమ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కీర్తి నగర్ బ్లాక్ నంబర్ 2లోని ఫర్నిచర్ షోరూమ్‌లో సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.సమాచారం అందుకున్న వెంటనే 17 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించినట్లు వారు తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa