రోడ్లపై కొందరు స్పోర్ట్స్ బైక్స్‌తో సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిన్న గ్యాప్‌లు దొరికితే చాలు రయ్ మంటూ గాలి వేగంతో దూసుకెళ్తూ ఉంటారు. దీనికి తోడు ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు కూడా చేస్తుంటారు. అయితే అలాంటి స్టంట్లు తిప్పికొట్టి ప్రమాదాల్లో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఆ స్టంట్ల సమయంలో తమ వద్ద కెమెరాను ఉంచుకుని వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిదే తాజాగా ఓ ఘటన జరిగింది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఓ బైకర్.. ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి శరీరంలో ఉన్న 20 కి పైగా ఎముకలు విరిగిపోయాయి. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని డేటోనా బీచ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి రహదారిపై ఓ వ్యక్తి తన హోండా సీబీఆర్ బైక్‌తో అతి వేగంగా వెళ్తూ స్టంట్లు చేశాడు. ఇక తన వద్ద ఉన్న ఉన్న కెమెరాతో తన డ్రైవింగ్‌ను వీడియో కూడా తీసుకున్నాడు. ట్రాఫిక్‌లో మితిమీరిన వేగంతో బైక్‌ను నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యాడు. గంటకు 225 కిలోమీటర్ల స్పీడుతో స్టంట్లు చేస్తూనే ముందు వెళ్తున్న ఓ భారీ ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ బైకర్ చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు.
ఈ ఘటనలో ఆ బైకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆ బైకర్ శరీరంలోని 20 కి పైగా ఎముకలు విరిగినట్లు గుర్తించారు. దీంతో అతడికి అత్యవసరంగా మెరుగైన చికిత్స అందించారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆ ఆస్పత్రిలోనే ఆ బైకర్ చికిత్స పొందాడు. ఆ ప్రమాదం నుంచి ఇటీవలె కోలుకున్న బైకర్.. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
తాజాగా కొన్ని నెలల క్రితం తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పోస్ట్ చేశాడు. బైక్ రైడింగ్‌పై పూర్తిగా పట్టు సాధించకుండానే తాను అతి వేగంతో బైక్ నడిపి స్టంట్లు చేసినట్లు తెలిపాడు. తాను చేసిన తప్పు కారణంగానే ఘోర ప్రమాదానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. త్వరలో రైడింగ్ చేసేందుకు తిరిగి వస్తానంటూ ఆ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ బైకర్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.