కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఈ ఘటనలో ఉగ్రకోణం ఉన్నట్లు బావిస్తోంది. తాజాగా, ఈ పేలుడుకు సంబంధించి 70కిపైగా పుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఓ నీలం రంగు కారు పేలుడుకు కొన్నిసెకన్ల ముందు కన్వెన్షన్ సెంటర్ పార్కింగ్ నుంచి వెళ్లిపోయింది. ఈ కారులోనే నిందితులు పరారైనట్టు అనుమానం వ్యక్తమవగా, కారు నంబరు తప్పుగా ఉండడం గమనార్హం.