పట్టిసీమ కట్టినోడు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అసమర్థులైన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా? అని టీడీపీ నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. రూ.1600 కోట్లు ఖర్చుపెట్టిన పట్టిసీమ రూ.50 వేల కోట్ల సంపాదన సృష్టించింది. ఇక్కడ 24 పంపులు ఉంటే నీళ్ల అవసరం ఎక్కువగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో 18 పంపులు ఆడిస్తున్నారంటే ఇంత చేతగాని పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఎవరైనా ఉంటారా?అని ప్రశ్నించారు, అదే చంద్రబాబు ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రిగా ఉంటే 24 పంపులు ఆడించి.. 100 టీఎంసీలు గోదావరి నీళ్లు తీసుకెళ్లేవారు అని తెలిపారు.