ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజంగా గుర్రాలకు గెలవాలనే సామర్థ్యం,,,,రేసులో పాల్గొనే గుర్రాలపై నిపుణుల అధ్యయనం

international |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 10:27 PM

రేసింగ్‌లో పాల్గొనే గుర్రాలకు తాము రేసులో ఉన్నామని తెలుసా? గెలవాలనే కోరిక కూడా ఉంటుందా? మొదటి పోస్ట్ దాటినప్పుడు వాటికి అర్థమవుతుందా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ముగింపుకు చేరుకోవడం అంటే అధిక వేగంతో దూసుకెళ్లడం. జాకీ కొరడా దెబ్బలు కొట్టడం వంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి అవి వేగంగా వెళ్తాయి. కానీ ఫినిషింగ్ పోస్ట్‌ను దాటిన తర్వాత అన్ని గుర్రాలకు ఇదే వర్తిస్తుంది. గెలుపొందిన గుర్రం మైదానంలో తన వెనుక వచ్చే గుర్రాల కంటే చివరి దశలో ఎక్కువగా కొరడా దెబ్బలు తినే అవకాశం ఉందని అని చార్లెస్ స్టర్ట్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్- ఎన్విరాన్‌మెంటల్ అండ్ వెటర్నరీ సైన్సెస్ లెక్చరర్ క్యాథరిన్ హెన్‌షాల్ అన్నారు.


‘‘చివరి పోస్ట్‌ను చేరుకోవడం అనేది గుర్రం- మానవ సంబంధాలకు చాలా ముఖ్యమైంది అయితే, ఈ ఫలితాన్ని సాధించడానికి స్వచ్ఛందంగా వేగంగా దూసుకుపోయేలా గుర్రానికి చాలా తక్కువ ప్రత్యక్ష, అంతర్గత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి గుర్రానికి అది రేసులో ఉందని కూడా తెలుసా? అంటే.. సమాధానం లేదు. రన్నింగ్ (కాంటరింగ్ లేదా గ్యాలోపింగ్) అనేది గుర్రం ప్రవర్తన, అవకాశం దొరికినప్పుడు స్వచ్ఛందంగా సమూహాలలో కలిసి పరుగెత్తుతాయి. ఏది ఏమైనప్పటికీ గుర్రాలు సమూహం పోటీ సమయంలో గెలవాలనే కోరికను లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి.


గుర్రాలు సామాజిక జంతువులు. అడవిలో తమ సమూహంలో ఇతర గుర్రాలతో కలిసి జీవిస్తాయి. ఈ సమకాలీకరణలో సమూహంలోని ఇతర సభ్యులకు సమానమైన వేగాన్ని నిర్వహించడం, తాకిడిని నివారించడానికి పక్కనున్న వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం, రాబోయే ప్రమాదం లేదా అడ్డంకులను సూచించే వేగాన్ని స్వీకరించడం.. అడవిలో విజేత అంటే ఇతర సమూహంలో ఇతర వాటి కంటే ముందుగా చేరుకోవడం.’’ అని తెలిపారు.


‘‘గుర్రపు పందేలు రెండు సంబంధిత కారకాలపై ఆధారపడి ఉంటాయి.. ఇతర గుర్రాలతో సమకాలీకరించడానికి గుర్రం సహజమైన ధోరణి.. రేసు సమయంలో జాకీ నుంచి వచ్చిన సూచనలకు ప్రతిస్పందనగా ఈ ధోరణులను పట్టించుకోకుండా శిక్షణ పొందే సామర్థ్యం.. శిక్షకులు, జాకీలు వ్యక్తిగత గుర్రాల ప్రాధాన్యతలను కూడా ఉపయోగిస్తారు. కొన్ని గుర్రాలు రేసు సమయంలో ఇతర వాటితో దూకడం పట్ల విముఖంగా ఉంటాయి. కాబట్టి జాకీలు వాటిని మైదానం ముందు వైపుకు తరలించడానికి అనుమతిస్తారు.. ఇతర గుర్రాల సమూహం భద్రతను కోరుకుంటాయి కాబట్టి జాకీలు వాటిని చివరి పోస్ట్‌కు దగ్గరగా వచ్చే వరకు నియంత్రిస్తారు.’’ అని పేర్కొన్నారు.


‘‘ఇతర గుర్రాలకు చాలా దగ్గరగా ప్రయాణించేలా నిర్దేశించడం, గుర్రం ఎంపిక చేసుకుని వేగంతో ప్రయాణించడం, ఫీల్డ్‌లోని ఇతర గుర్రాలు దాని స్థానాన్ని మార్చకుండా నిరోధించడం ముఖ్యమైనవి.. రేసు ప్రారంభంలో జాకీలు గుర్రాల సహజ కోరికపై ఆధారపడతారు. ఫ్రంట్ రన్నర్‌లుగా ఉండేందుకు అవసరమైన శారీరక శ్రమను కొనసాగించేలా గుంపుతో ఉంటాయి. కాబట్టి గుర్రం సమూహంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. గెలవడానికి ముందుకు వస్తుంది... గుర్రాలకు చాలావరకు రేసులో ఉన్నామనే భావన ఉండదు.. ఇక్కడ వాటి పరుగు లక్ష్యం ఇతర గుర్రాల కంటే ముందుగా ట్రాక్‌లో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోవడం. అయినప్పటికీ, రేసులో ఉండటం ఎలా ఉంటుందో వాటికి నిస్సందేహంగా తెలుసు.. అంటే ముందస్తు అనుభవం, శిక్షణ ద్వారా నేర్చుకుంటాయి.


వ్యక్తిగత ప్రాధాన్యతలను అర్థం చేసుకునే జాకీలు, శిక్షకుల కారణంగా సమూహంలోని ఇతర వాటి కంటే విజేత గుర్రం ఎల్లప్పుడూ ముందుంటుంది. కానీ గెలుపొందిన గుర్రాలకు ఇతర గుర్రాల కంటే ముందుగా గెలిచిన స్థానానికి చేరుకోవాలనే సహజమైన కోరిక కంటే.. సహజమైన సామర్థ్యం, శారీరక దృఢత్వం, జాకీ నైపుణ్యాల కలయిక వల్ల గెలుస్తుంది’ అని క్యాథరిన్ హెన్‌షాల్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com