నేడు ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. ముందుగా అఫ్గానిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లకు కేవలం 244 పరుగులు చేసింది. ఆ తరువాత 245 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 47.3 ఓవర్లలో 5 వికెట్లకు కేవలం 247 పరుగులు చేసి విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో వాన్ డెర్ డస్సెన్ 76 పరుగులు చేసారు,డికాక్ 41 పరుగులు ఫెహ్లుక్వాయో 39 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa