ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో అత్యధిక అంతర్జాతీయ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్లు ఇండియన్సే

international |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 11:53 PM

జనాభా విషయంలో ఆరు నెలల క్రితమే చైనాను దాటేసిన భారత్.. ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషయంలోనూ మన దేశం చైనాను అదిగమించింది. ఈసారి అమెరికా వేదికగా. అదేంటని అనుకుంటున్నారా..? విద్యను అభ్యసించేందుకు మన దేశం నుంచి ఏటా లక్షలాది విద్యార్థులు అమెరికా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చదువుకోవడం కోసం అమెరికా వెళ్తున్న గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో చైనీయులు తొలిస్థానంలో ఉండగా.. తాజాగా ఇండియా టాప్ ప్లేస్‌లోకి వెళ్లిందని ఓ సర్వే వెల్లడించింది.


గత మూడేళ్లుగా ఉన్నత విద్యా కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికా వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య 2022-23లో 35 శాతం పెరిగి.. 268,923కి చేరుకుంది. ఈ క్రమంలోనే అమెరికాలోని అత్యధిక మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల విషయంలో చైనాను భారత్ అధిగమించింది. 2009/10 తర్వాత ఈ విషయంలో చైనాను భారత్ అధిగమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


అమెరికాలో పది లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉండగా.. వారిలో 25 శాతానికిపైగా భారతీయ విద్యార్థులే ఉండటం గమనార్హం. 2022-23లో అమెరికా వెళ్లిన భారత గ్రాడ్యుయేట్ల సంఖ్య 63 శాతం పెరిగి 165,936కు చేరుకుంది. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే 16 శాతం పెరిగింది. అమెరికాలో విద్యను అభ్యసించడానికి చాలా మంది భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కానీ చాలా మంది వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా సరే పెద్ద మొత్తంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రవేశం పొందడం గమనార్హం. తాత్కాలికంగా పని చ


జూన్-ఆగస్టు 2023 మధ్య కాలంలో యూఎస్ ఎంబసీ, భారత్‌లోని కాన్సులేట్లు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేశారు. భారత్‌లోని కాన్సులర్ ఆఫీసర్లు ఎఫ్, ఎం, జే కేటగిరీల్లో 95,269 వీసాలు జారీ చేశారు. 2022తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండగా.. మరోవైపు చైనా విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2022-23లో 290,000 మంది చైనా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం, యూకే, కెనడా తదితర దేశాల్లోని యూనివర్సిటీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో అమెరికా వెళ్లే చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీంతో అమెరికా యూనివర్సిటీలు భారత విద్యార్థులవైపు దృష్టి సారించాయి. అమెరికాలోని ఇల్లినాయిస్, మిచిగాన్, టెక్సాస్ తదితర 24 రాష్ట్రాల్లో భారత విద్యార్థులు.. చైనా స్టూడెంట్స్‌ను అధిగమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com