ప్రముఖ వ్యాపారవేత్త, 2014లో విజయవాడ ఎంపీగా వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ (73) కన్నుమూశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రాజేంద్రప్రసాద్‌కు భార్య విమలాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేంద్రప్రసాద్ పుట్టి పెరిగింది విజయవాడలోని గుణదలలో.. ఆయన తండ్రి కోనేరు మధుసూదనరావు విజయవాడలో గతంలో ప్రముఖ వైద్య నిపుణులు. కాలేజీలో చదివే సమయంలోనే.. విద్యాభ్యాసాన్ని మధ్యలో వదిలేసిన రాజేంద్రప్రసాద్ ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
కోనేరు రాజేంద్రప్రసాద్ ఎమ్మార్ కేసులో గోల్ఫ్ కోర్సు, విల్లాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు హైదరాబాద్ సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో కోనేరు రాజేంద్రప్రసాద్ వైఎస్సార్‌సీపీ రాజీనామా చేసిన రాజేంద్రప్రసాద్ అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చెన్నైలో కుటుంబంతో కలసి ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని చెన్నై తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. కోనేరు మరణంపై ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.