ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో మరికొంత మంది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును చేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గంటను కోటా జిల్లాలోని చంబల్ రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాన్ని ఫిట్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బెల్ మేకింగ్ ఇంజనీర్ దేవేంద్ర ఆర్యతోపాటు మరో కూలీ చనిపోయారు. ఘటన సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 80 వేల కిలోలు ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గంటను బిగిస్తుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ గంటను తయారు చేసినప్పటి నుంచి అది వార్తల్లో నిలిచింది. చంబల్ రివర్ ఫ్రంట్‌ను ఇటీవలె రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఘటనపై విచారణ చేపట్టారు.
కోటా సిటీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలిపింది. ఎంతో కష్టపడి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గంటను సిద్ధం చేశారని.. అయితే ఆ గంటను అచ్చు పెట్టెలో కొంత సమయం పాటు కప్పి ఉంచారని వెల్లడించింది. ఆ అచ్చు పెట్టె నుంచి గంటను తెరవాల్సి ఉండగా.. దాని కోసం గంటను తయారు చేసిన ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, తన బృందంతో ఘటనా స్థలికి చేరుకుని పనులు చేస్తుండగా.. ఈ దుర్ఘటన జరిగింది.
అచ్చు పెట్టెలోని గంటను బయటకు తీయడానికి దానిపైకి ఎక్కిన దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు.. 35 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దేవేంద్ర ఆర్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇలా ప్రపంచంలోనే అతి పెద్ద గంటను తయారు చేసి బిగిస్తుండగా ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.