విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం ద్వారా లబ్ది పొందాలంటే జాయింట్ అకౌంట్ ఉండాలని సూచించింది. విద్యార్థి, తల్లి పేరుతో ఈ నెల 24లోగా జాయింట్ అకౌంట్లను తెరవాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జమ చేస్తోంది.