వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే ఫర్వాలేదు తనవాళ్లు బాగుంటే చాలు అనుకునే వ్యక్తి చంద్రబాబు అయితే, అందరూ బాగుండాలి. అందులో తానూ ఉండాలి అనుకునే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసేది వైయస్సార్ సీపీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. దివంగత వైెస్ రాజశేఖర్ రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లతో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించగలిగామని, సీఎం జగన్ మైనార్టీలకు డిప్యూటీ సీఎం కూడా కేటాయించారని వివరించారు. ముస్లింలకు షాదీ తోఫా అప్పట్లో కేవలం రూ. 50 వేలు ఇస్తే, జగన్ లక్ష రూపాయలు చేసారని, ఇమామ్ లకు రూ. 5 నుంచి 10 పదివేలు చేసారని, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నందుకు జగనే తమ నమ్మకమని ఉద్ఘాటించారు.హజ్ యాత్రకు కూడా విశేషంగా ఆర్థిక సాయం చేస్తూ చేయూతనిస్తున్నారని కొనియాడారు.