అనకాపల్లి జిల్లా, పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 11:30 గంటలకు వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ జరపనున్నారు. 12 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం 3 గంటలకు వెల్ఫే ర్ కాలేజీ నుంచి సబ్బవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్బవరం జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa