కర్ణాటకలో ఓ విచిత్రమైన సన్నివేశం కనిపించింది. ఓ శునకం ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్చర్యపరిచింది. హొన్నాళి తాలూకా క్యానికెరెకు చెందిన తిప్పేశ్ అనే యువకుడు నవంబర్ 16న తన సోదరిని బస్ స్టాప్‌లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళుతండగా.. బైక్‌కు జాగిలం అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన కింద పడి గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. అయితే ఆ కుక్క తిప్పేశ్ డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళుతుండగా.. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 8 కిలోమీటర్లు ఫాలో అయ్యింది. అలా ఇంటిని ఆ శునకం వెతుక్కుంటూ వచ్చింది.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆ కుక్క నేరుగా తిప్పేశ్ ఇంటిలోకి వచ్చే ప్రయత్నం చేసిందని.. ఇంటి దగ్గర కనిపించడంతో.. మొదట వీధి కుక్క అని భావించి తరిమేశామని మృతుని మేనమామ సందీప్ అంటున్నారు. ఆ శునకం తిప్పేశ్ తల్లి యశోదమ్మ పక్కన కూర్చుని మౌనంగా దుఃఖించిందని చెప్పుకొచ్చారు. దాన్ని అనునయించినా.. విపరీతమైన మూగ బాధను వ్యక్తం చేసిందట. అంతేకాదు ఆ శునకం యశోదమ్మ చేతిలో తలపెట్టి బాధపడిందట. చాలాసేపు అన్ని గదులనూ చూసి, మళ్లీ అది వెళ్లిపోయిందని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోందట. ప్రమాదవశాత్తూ తిప్పేశ్ చనిపోయాడని.. ఆ కుటుంబం బాధలో ఉంది. అదే సమయంలో ఆ శునకం మాత్రం తన వల్ల తిప్పేశ్ చనిపోయాడనివారి ఇంటికి వెళ్లిన ఘటన ఇప్పుడు చ్చనీయాంశమైంది.