భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా మార్గం రైలు మార్గం. దేశవ్యాప్తంగా మొత్తం రైల్వేల పొడవు 67,956 కిలోమీటర్లు. అయితే రైల్వేలు కొన్ని కోడ్‌లను ఉపయోగిస్తాయి. రైలు చివరి భోగి వెనుక ‘ఎక్స్’ గుర్తును ఎప్పుడైనా గమనించారా?. దానికి అర్థమేంటంటే.. ఆ గుర్తు ఉంటే రైలు భోగీలు పూర్తయ్యాయని అర్ధం. ఆ రైలులోని చివరి కోచ్ అదే. రైలు స్టేషన్ దాటినప్పుడు అన్ని కోచ్‌లు పూర్తిగా లోడ్ అయ్యాయని నిర్ధారించుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు.