కాకినాడ సముద్ర జలాల్లో బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంజిన్‌లో మంటలు భారీగా చెలరేగాయి. అందులో వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. రూ.80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బోటు పూర్తిగా దగ్ధమైంది. వారం కిందట సముద్రంలో బోటు వేటకు వెళ్లింది. తుపాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణమైంది. కాకినాడ చేరేందుకు ఇంకా నాలుగు గంటల సమయం ఉండగానే తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.12 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. కోస్ట్ గార్డ్ ఆపరేషన్ తో 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.