తెలంగాణ ఎన్నికల ఈ ఫలితం పది రోజల ముందు నుంచే ఊహించిందేనని, మొదటి నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని భావించానని టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలు మార్పు కోరుకోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎంతో కొంత చేశారు కానీ అహంభావం కారణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మనిషికి ఎప్పుడైతే అహంభావం వస్తుందో అతడు పాతాళానికి పోతాడని కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని, ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు కానీ జగన్ సైకో అని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. లేనిపోని తప్పులన్ని చేసి సమాధి అయ్యే పరిస్థితుల్లో జగన్ ఉన్నాడని, తెలంగాణలో కూడా అదే జరిగిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫలితమే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని దీమా వ్యక్తం చేశారు.