మిచౌంగ్ తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచే కందుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతమైన ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో వర్షానికితోడు బలమైన గాలులు వీస్తూ. సముద్రంలోని అలలు ఎగిసిపడుతున్నాయి. విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక రామాయపట్నం పోర్టు ప్రాంతంలో గల మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు.