బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి, లోతట్లు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలలకు తరలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్), ఎస్‌డిఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) బృందాలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పరిశీలించారు.