కూరగాయల్లో ప్రధానమైన టమాటా శీతాకాలంలో పండే పంట. సమశీతోష్ణ మండలంలో కూడా ఈ పంట సాగు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం, మంచు ఉన్న వాతావరణం టమాటా పంట సాగుకు అనుకూలం కాదు.
తెలుగు రాష్ట్రాలలో టమాట సాగును అన్ని కాలాల్లో పండిస్తారు. కాగా, ఒక ఎకరాకు 200 గ్రాముల టమాటా విత్తనాలు అవసరం అవుతాయి. ఈ పంటను వరుసలలో కానీ లేదా బోదెలలో కానీ నాటుకోవచ్చు.