అందరికీ నమస్కారం, అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ఈ పుణ్యభూమికి మన జగనన్న రావడం మన అందరి అదృష్టం, ఆ విప్లవ వీరుడి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుచేసిన మన సీఎంగారికి ధన్యవాదాలు అని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీఅన్నారు. ఆమె మాట్లాడుతూ... గిరిజన ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు తీరుస్తూ మన గిరిజన హక్కులు కాపాడుతున్న మన అభినవ అల్లూరి జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మీరు వందేళ్ళు చల్లగా ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను, మీ విజనరీ లీడర్‌షిప్‌లో విద్యారంగానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే ప్రపంచ దేశాల ప్రశంశలు కనిపిస్తాయి, పోటీ ప్రపంచంలో బడుగు బలహీనవర్గాల విద్యార్ధులు కూడా పోటీ పడాలని మీరు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు, డిజిటల్ ఎడ్యుకేషన్ పేదలకు అందుతోంది, విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధన్యతనిచ్చి మా గిరిజనులకు కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్నారు, చంద్రబాబు బాక్సైట్ జీవో 97 తీసుకువస్తే జగనన్న గిరిజనుల పక్షాన నిలబడి అధికారంలోకి రాగానే రద్దు చేశారు, నాడు వైయస్ఆర్ గారి హయాంలో అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే నేడు జగనన్న నా పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 ఎకరాల భూమిపై హక్కు కల్పించిన ఘనత జగనన్నది, సామాజిక న్యాయానికి సంపూర్ణ అర్ధం చెప్పిన జగనన్నను మేం ఎప్పటికీ మరువం, మీరు సోషల్ జస్టిస్ రియల్ అంబాసిడర్, పారదర్శక పాలన అందించారు, గడప గడపకూ మన ప్రభుత్వంలో అన్ని సచివాలయాలు సందర్శించాను, మా నియోజకవర్గంలో రూ. 1,251 కోట్లు నేరుగా ప్రజల అకౌంట్‌లో జమ అయ్యాయి, మా నియోజకవర్గంలో బ్రిడ్జి నిర్మాణం, కొన్ని పంచాయతీల పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నాను. మా గిరిజనులు మీ మేలు ఎప్పటికీ మరువరు, ఏపీ ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa