చారిత్రాత్మక నిర్ణయంలో, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్, 1867లోని వలసవాద యుగం చట్టాన్ని రద్దు చేస్తూ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభలో ఇప్పటికే ఆమోదించారు. కొత్త శాసనం - ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 ఎలాంటి భౌతిక ఇంటర్‌ఫేస్ అవసరం లేకుండా ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా పీరియాడికల్స్ టైటిల్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళంగా మరియు ఏకకాలంలో చేస్తుంది. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడుతూ సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, "బానిసత్వపు మనస్తత్వాన్ని తొలగించి, నవ భారతదేశం కోసం కొత్త చట్టాలను తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో అడుగును ఈ బిల్లు ప్రతిబింబిస్తుందని" అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa