వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... సామాజిక సాధికార యాత్ర ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. దేశంలో ఎందరో నాయకులు సామాజిక సాధికారత కోసం ఉద్యమాలు చేశారు. కానీ వారి కలలు అప్పుడు సాకారం కాలేదు. దేశంలో తొలిసారి ఏపీలో ఆ కలలు సాకారం అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి పెరిగింది. ఈ వర్గాలు ధైర్యంగా బతుకుతున్నరాజకీయాలు ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూశారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని ఉత్తరం రాశాడు. దేశంలో ఎస్సీల మీద దాడుల్లో చంద్రబాబు హయాంలో ఏపీ 4వ స్థానంలో ఉందని ఎన్సీఆర్‌బీ రిపోర్ట్ చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో పేదవాడు ధైర్యంగా బతుకుతున్నాడు. తలుపుతట్టి సంక్షేమ పథకం అందిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకున్నాయి. చట్టాలను మనకు చుట్టాలుగా చేసిన సీఎం జగన్. రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తే వాటిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యం. పేదవాడి పిల్లవాడు ఫీజుల కోసం ఆలోచించకుండా ధైర్యంగా ఇంగ్లీషు మీడియం చదువుతున్నాడు. మొన్నటి దాకా ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలుంటే ఈరోజు రూ.25 లక్షల దాకా చికిత్స అందిస్తున్నారు. ఇంటికొచ్చాక పనిచేసుకోలేని పరిస్థితి ఉంటే ఖర్చులకు డబ్బులిచ్చే సీఎం జగన్. 31 లక్షల ఇళ్లపట్టాలిస్తే 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం. రాజధానిలో పేదలకు ఇంటి స్థలాలిస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు కలిసికట్టుగా ఉండి జగనన్నను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.