ట్రెండింగ్
Epaper    English    தமிழ்

54 రోజులూ అడవిలో జంతువులా ఉన్నా.. హమాస్ చెర నుంచి విడుదలైన మియా స్కెమ్

international |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 12:05 AM

హమాస్ చెర నుంచి 54 రోజుల తర్వాత విడుదలైన ఇజ్రాయేల్ యువతి తన భయానక అనుభవాన్ని పంచుకుంది. అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడి మారణహోమానికి పాల్పడిన హమాస్.. 250 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. బాధిత యువతి మియా స్కెమ్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువతి మాట్లాడుతూ.. ఆ 54 రోజులు అడవిలో జంతువులా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ కసాయి తనను బందీగా పట్టుకెళ్లాడని ఆమె వెల్లడించింది.


‘గాజాలో నివసించే ప్రజల గురించి, నేను అక్కడ అనుభవించిన వాటి గురించి నిజాలను చెప్పడం చాలా ముఖ్యం.. నేను ఓ కసాయి ద్వారా వెళ్లాను.. అక్కడున్నవారంతా ఉగ్రవాదులే’ అని బాధితురాలు పేర్కొంది. అక్టోబరు 7న తనను మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద అపహరించి, బందీగా తీసుకెళ్లారని ఆమె తెలిపింది. హమాస్ గ్రూప్‌తో సంబంధం ఉన్న గాజాలోని ఒక పౌర కుటుంబం ద్వారా అపహరించారని వివరించింది.


‘నేను ఒక కుటుంబంతో ఉన్నానని అకస్మాత్తుగా గ్రహించాను.. వారిని కొంతమంది కుటుంబ సభ్యుల ఇంట్లో ఎందుకు ఉన్నాను? ఇక్కడ పిల్లలు ఎందుకు ఉన్నారు? భార్య ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను’ అని చెప్పింది. తనను తాను సఫారీలో జంతువుగా భావించానని ఆమె వ్యాఖ్యానించింది. తుపాకీ తూటాతో చేతికైన గాయానికి ఓ వ్యక్తి చికిత్స చేశాడని తెలిపింది. మియాను బందీగా చేసుకున్న తర్వాత హమాస్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ‘నన్ను బాగానే చూసుకుంటున్నారు.. మందులు ఇస్తున్నారు.. అంతా బాగానే ఉంది. నన్ను వీలైనంత త్వరగా నా తల్లిదండ్రులు, నా తోబుట్టువుల వద్దకు తీసుకురావాలని మాత్రమే నేను కోరుతున్నాను.. దయచేసి వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి పంపించండి’ అని వేడుకుంది.


ఇజ్రాయేల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ- బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా మియా స్కెమ్‌‌కు విముక్తి లభించింది. ఆమె విడుదలైన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. దాడి తేదీని టూటూగా వేసుకుని ‘మేము మళ్లీ డ్యాన్స్ చేస్తాం’ అని పేర్కొంది. ‘నొప్పి, భయం, కష్టమైన దృశ్యాలు, తిరిగి రాని స్నేహితులు మేము ఎప్పటికీ మరచిపోం... కానీ మేము గెలుస్తాం.. మేము నృత్యం చేస్తాం’ ఆమె జోడించింది. అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై హమాస్‌ దాడిలో దాదాపు 240 మంది బందీలను పట్టుకోగా.. దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఇజ్రాయేల్ ప్రతీకార దాడిలోనూ దాదాపు 20 వేల మంది చనిపోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com