ఇతర అనారోగ్య సమస్యలున్న బాధితులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జేఎన్-1 కరోనా వైరస్ లక్షణాలు 30 మందికి నిర్ధారణ అయ్యాయన్నారు. ఈ రకం వైరస్ ప్రమాదకరం కాదని, 4 రోజుల్లో దీని ప్రభావం తగ్గుతుందని అన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.