యూకేలో ఓ 16ఏళ్ల బాలిక ఆన్‌లైన్‌లో సామూహిక అత్యాచారానికి గురైంది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌తో మెటావర్స్‌లో గేమ్ ఆడుతుండగా
ఆమె అవతార్ (డిజిటల్ క్యారెక్టర్)పై గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. భౌతికదాడి జరగనప్పటికీ ఆమె తీవ్ర మనస్థాపం చెందిందని, భౌతిక లైంగికదాటికి గురైన భావనలో ఉందని పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసును దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి.