ఆస్పత్రిలో ప్రమాదవశాత్తూ జరిగిన ఏసీ పేలుడులో ఓ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఆ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. ఇక, భర్త చనిపోయాడనే దుఃఖంలో అతడి భార్య మర్నాడు ఆత్మహత్యకు పాల్పడింది. కానీ, చివరకు ఆ వ్యక్తి కాలినగాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు తెలియడంతో కుటుంబ షాకయ్యింది. ఈ విషాదకర ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
ఒడిశాకు చెందిన 34 ఏళ్ల దిలీప్ సామంతరాయ్ అనేక వ్యక్తి.. భువన్వేర్ హైటెక్ ఆస్పత్రిలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 29న ఆస్పత్రిలో ఏసీలను సర్వీస్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దిలీప్‌తో పాటు జ్యోతిరంజన్ మల్లిక్, సింహాచలం, శ్రీతమ్ అనే నలుగురు టెక్నీషియన్లు తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబరు 30 జ్యోతిరంజన్ చనిపోగా.. మర్నాడు శ్రీతమ్ మృతిచెందాడు. అయితే, జ్యోతిరంజన్‌ను పొరపాటున ఆస్పత్రి వైద్యులు దిలీప్‌గా గుర్తించి, అతడి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
మృతదేహానికి డిసెంబరు 31న అంత్యక్రియలు నిర్వహించగా.. దిలీప్ భార్య సోనా (24) జనవరి 1న బలవన్మరణానికి పాల్పడింది. ఇంతలో చనిపోయింది దిలీప్ కాదు జ్యోతిరంజన్ అని తేలింది. దీంతో తమ కుమారుడు బతికే ఉన్నాడని భావించిన జ్యోతిరంజన్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని, కనీసం అంత్యక్రియలు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రంజన్ భార్య అర్పిత ముఖి మాట్లాడుతూ.. ‘నా భర్త తిరిగి రావాలని కోరుకున్నాను.. తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చికిత్స సమయంలో నేను అతనిని గుర్తించలేకపోయాను’కన్నీటిపర్యంతమైంది. తప్పుడు సమాచారమే సోనా ఆత్మహత్యకు కారణమైందని ఆసుపత్రి వెలుపల వారి బంధువులు నిరసనకు దిగారు. ‘మా కుటుంబం చిన్నాభిన్నమైంది. హాస్పిటల్ ఇచ్చిన ఈ తప్పుడు సమాచారంతో నా మేనకోడలు ఆత్మహత్య చేసుకుంది’ అని సోనా మేనమామ రవీంద్ర జెనా వాపోయారు. బాధిత కుటుంబాలు ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా జరగడానికి వారి నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాయి. అయితే, వీటిని ఆసుపత్రి ఖండించింది. ‘మేము తప్పు చేయలేదు.. ఏసీలను రిపేర్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా టెక్నీషియన్లు వచ్చారు.. పేలుడు తర్వాత చికిత్స కోసం అడ్మిట్ అయినప్పుడు వారిలో ప్రతి ఒక్కరినీ సంస్థతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్ గుర్తించారు’ అని ఆసుపత్రి సీఈఓ స్మితా పాధి తెలిపారు. అన్నారు. ప్రతి ఒక్క బాధితుడ్ని పరిశీలించామని, న్యాయపరంగానూ, వైద్యపరంగా అన్ని విధానాలను పాటించామని చెప్పారు.