సాధారణంగా దేవునికి సంబందించిన రోజున పండుగలు వస్తాయి. కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న. సంక్రాంతి కేవలం పండగ కాదు జీవన విధానం.
వర్షాకాలం ముగిసి పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకునే సంబరమిది. మూడు రోజుల వ్యక్తిత్వ వికాస మేళవింపు ఈ పండగ స్వంతం. పెద్దా చిన్నా కుటుంబం అంతా ఏకమై పిండివంటలతో సంబరంగా జరుపుకునేదే సంక్రాంతి.