ఉత్తర కొరియా కదళికలపై నిఘా వేసేందుకు జపాన్ చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టనుంది.
అలాగే వాతావరణంలో ఏర్పడే మార్పులను ముందస్తుగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. తనేగషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్2ఏ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రాలను తీయగలదు.