2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరులో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సమన్వయకర్తల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసింది.
తూర్పు సమన్వయకర్తగా ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరీ ఫాతిమా, పశ్చిమకు మంత్రి విడదల రజినీని నియమించారు. గుంటూరు చరిత్రలో 2 నియోజకవర్గాలకు మహిళలను కేటాయించడం ఇదే ప్రథమం. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూరీ ఫాతిమా, విడదల రజిని తమ కార్యకలాపాలను వేగవంతం చేశారు.