ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనకు సర్వర్ సమస్య ఎదురవుతోంది. శనివారం రెండో రోజు చిలమత్తూరు మండలంలో నిర్వహించారు. కులగణనకు ప్రత్యేక రూపొందించిన యాప్ సరిగా పనిచేయక ఇబ్బందులు పడ్డారు. ఈ గణనలో కుటుంబ పెద్ద ఉన్నారా? లేక మరణించారా? లేక వలస వెళ్లారా? జిల్లా, మండలం, గ్రామం, గ్రామ పంచాయతీ, వార్డు తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఉద్యోగులు తంటాలు పడుతున్నారు.